ఓటర్​ ఐడీతో ఆధార్ లింక్.. గడువుపై కేంద్రం కీలక నిర్ణయం

-

ఓటర్ కార్డును ఆధార్​తో లింక్ చేయనివారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఓటర్ కార్డుతో ఆధార్ నెంబర్​ను అనుసంధానం చేసేందుకు ఉన్న గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. 2023 ఏప్రిల్‌ 1నుంచి 2024 మార్చి 31 వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నిజానికి ఆధార్- ఓటర్ అనుసంధానానికి గడువు ఏప్రిల్ 1తోనే ముగియాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గతేడాది జూన్ 17న తన నోటిఫికేషన్​లో పేర్కొంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్​తో అనుసంధానం చేయాల్సిన ఓటర్లు ఫామ్​-6ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల సంఘం.. నమోదిత ఓటర్ల నుంచి ఆధార్‌ కార్డు నెంబర్లు సేకరించడం ప్రారంభించింది. కానీ, వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ క్రమంలో ఓటర్ కార్డుతో ఆధార్ నెంబర్​ను అనుసంధానం చేసేందుకు ఉన్న గడువును మరోసారి పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version