Prabhas: ఆ సినిమా కోసం.. కళ్లు చెదిరే రెమ్యూనేష‌న్.. ప్ర‌భాస్ కు అన్ని కోట్లా!

-

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబ‌లి సెన్సెష‌న‌ల్ స‌క్సెస్ తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ జోష్‌తో.. వరుసగా పాన్ ఇండియా సినిమాలను గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. భవిష్యత్తులోనూ
అదే త‌ర‌హా సినిమాల‌ను సెలెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మూవీ మేక‌ర్స్ కూడా అదే రేంజ్ ప్రాజెక్టుల‌ను ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తున్నారు. ప్రభాస్ కూడా రెమ్యూనరేష‌న్ తీసుకుంటన్నారని టాక్. ఈ మ‌ధ్య కాలంలో .. సోష‌ల్ మీడియాలో ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ వార్త చాలా వైర‌ల్ అవుతుంది.

బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా క‌నిపించ‌నున్నారు. రావ‌ణ సురుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా స‌న్నీ సింగ్ న‌టించనున్నారు. అయితే.. ఈ మూవీలో న‌టించినందుకు ఇప్పటివరకు ఏ స్టార్ హీరో అందుకోనటువంటి భారీ రెమ్యునరేషన్ ప్రభాస్ అందుకుంటున్నాడట. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటన్నారని టాక్. ఒకవేళా ఈ వార్త‌ నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

ఇప్పటికే షూటింగ్ మొదలైంది. మ‌రోవైపు విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా ఆగస్టు 11, 2022 న వ‌ర్డ‌ల్ వైడ్ గా విడుదల కానునది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

ఇటీవలే ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్ర‌పంచ స్థాయిలో విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్.. ‘ఆదిపురుష్’, ‘సలార్‌’ సినిమాల చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అలాగే.. ‘ప్రాజెక్ట్ k’ సినిమా కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version