తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్లిన తర్వాత ఆప్ఘనిస్తాన్ లో వరసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్ఘన్ పశ్చిమ ప్రావిన్స్ హెరాత్ నగరంలో శుక్రవారం జరిగిన పేలుడులో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. హెరాత్ నగరంలోని పీడీ 12లో ఈ పేలుడు సంభవించింది. క్రీడా మైదానంలో పేలుడు పదార్థాలు దాచి పెట్టారు. అయితే ఇదే సమయంలో యువకులు ఆడుకుంటుండగా… బాంబ్ పేలుడు సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కూడా ఈ పేలుడుకు బాధ్యత వహించలేదు. అంతకు ముందు జనవరిలో హెరాత్ లో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రజలు ప్రాణాల ఒదిలారు.
గతేడాది ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి… తాలిబన్లు అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచి ఆదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. దీనికి తోడు ఉగ్రదాడులు పెరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడులకు ఐసిస్ బాధ్యత వహించింది. ఆప్ఘన్ నుంచి అమెరికా సైన్యం వైదొలుగున్న సమయంలోనే కాబూల్ ఏయిర్ పోర్ట్ లో భీకర ఉగ్రదాడి జరిగిందిా. ఈ దాడిలో అమెరికన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా చనిపోయారు. ఆ తరువాత ప్రార్థనా మందిరాల్లో దాడులు జరిగాయి. తాజాగా హెరాత్ లో మరోసారి ఉగ్రదాడి జరిగింది.