మరో సంక్షోభం ముందు ఆప్గనిస్తాన్…

-

ఉగ్రవాదం, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆప్గనిస్తాన్ ను మరో సంక్షోభం వెంటాడుతోంది. దేశంలో రాబోయే కాలంలో విద్యుత్ కష్టాలు తప్పవని తెలుస్తోంది. ఇప్పటికే మధ్య ఆసియా దేశాలకు చెల్లించాల్సిన కరెంట్ బిల్లులు పేరుకుపోయాయి. తాజాగా దేశ రాజధాని కాబూల్ మరికొన్ని రోజుల్లో అంధకారంలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. దాదాపు 62 మిలియన్ డాలర్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. తాలిబన్లు గత ఆగస్టులో అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆప్గనిస్తాన్ పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. అమెరికా ఆప్గన్ నిధులపై ఆంక్షలు పెట్టింది. దీంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆప్గనిస్తాన్ లో 80 శాతం కరెంట్ మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, తజెకిస్తాన్ నుంచే వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదేశాల విద్యుత్ కంపెనీలకు ఆప్గన్ బిల్లులు కట్టలేకపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న శీతాకాలంలో రాజధాని కాబూల్ కు కరెంట్ కష్టాలు తప్పేలా లేవని పలు రిపోర్టులు తెలుపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version