ఆప్ఘన్ నుంచి నదీ జలాలు పంపిన బాలిక… అయోధ్య రామమందిర స్థలంలో సమర్పించిన యోగీ.

-

ఆప్ఘనిస్తాన్.. పూర్తిగా ముస్లిం దేశం. ముస్లీం చట్టాలను, షరియా లాను అనుసరించే కరుడుగట్టిన దేశం. అలాంటి దేశంలో ముస్లీం సంప్రదాయాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి. దీంతో పాటు ఇస్లాంను కాకుండా ఇతర మతాలను ఆదరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. నిజానికి ఒకే మతంలోని సున్నీ, ముస్లీం వర్గాలకే పడటం లేదు. అలాంటిది రామ మందిరం కోసం ఆ దేశ రాజధాని కాబూల్ కు చెందిన బాలిక కాబూల్ నదీ జలాలను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించింది.

తాజాగా కాబూల్ నదీ జలాలతో పాటు గంగా నదీ జలాలను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామమందిర నిర్మాణ స్థలంలో సమర్పించారు. కాబూల్ కు చెందిన సదురు బాలిక రాముని పట్ల అపరిమితమైన భక్తి భావాలను ప్రదర్శించిందని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవిత్ర నదుల జలాలను ఆలయ నిర్మాణ స్థలంలో సమర్పించాలని నిర్ణయించామని యోగీ అన్నారు. ప్రస్తుతం అయోధ్యలో యూపీ గవర్నమెంట్ భారీ స్థాయిలో రామ మందిరాన్ని నిర్మిస్తోంది. దీపావళి వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 75 జిల్లాల నుంచి సేకరించిన 12 లక్షల “దియాలు” (మట్టి దీపాలు) ఈ సంవత్సరం అయోధ్యలో వెలిగించనున్నట్లు రాష్ట్రం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version