తనిఖీలకు భయపడి.. వనస్థలిపురంలో బస్సు నిలిపిన ప్రైవేట్ ట్రావెల్స్

-

రాష్ట్రంలో ప్రైవేట్ టావెల్స్ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ బుక్ చేసిన ప్రదేశంలో కాకుండా వారికి నచ్చిన చోటే వదిలేసి వెళ్తున్నారని ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే బుధవారం ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులను ఆపి తనిఖీలు చేస్తున్నారు.

దీంతో తనిఖీలకు భయపడి బస్సులను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి.హైదరాబాద్‌‌లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తనిఖీలకు భయపడి వనస్థలిపురం వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా శాఖ అధికారుల తనిఖీలు పూర్తయ్యే వరకు బస్సులను సిటీలోకి తీసుకెళ్లబోమని డ్రైవర్లు చెబుతున్నారు. అయితే, ప్రయాణికులు కాల్ సెంటర్లకి ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news