తమన్: అఖండ తర్వాత మరో సారి బాక్స్ బద్దలే..!!

-

నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి సంక్రాంతికి 12 తేదీన విడుదల కు   సిద్దంగా ఉంది. ఈ సినిమాలో బాలయ్య కు తగ్గట్టుగా  అదిరిపోయే ఫైట్స్ , సూపర్ డైలాగ్స్,  సూపర్ క్లైమాక్స్  ఉండనున్నాయట.  ఈ సినిమా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మాస్ ను రాప్పడించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ టీజర్, సాంగ్స్ సినిమా పై  అంచనాలు విపరీతంగా పెంచాయి. బాలయ్య బాబు అఖండ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో , అలాగే గోపి చంద్ మలినేని  సూపర్ హిట్ క్రాక్ తర్వాత వస్తుండంతో ఫ్యాన్స్ లో  జోష్   ఉంది . ఇక అఖండ సినిమా లో మ్యూజిక్ ఇచ్చి అదర గొట్టిన తమన్ ఈ సినిమా కు కూడా అదిరి పోయే మ్యూజిక్ అందించానని తమన్ ఒక ఇంటర్వ్యూ సందర్బంగా చెప్పు కొచ్చాడు.

తమన్ మాట్లాడుతూ అఖండ సినిమా తో బాలయ్య బాబు తో నేను చాలా దగ్గర అయ్యాను. ఆ సినిమా సంగీతం ఓ రేంజ్ లో ఉండటం తో మళ్లీ వీరసింహారెడ్డి కోసం పిలిపించారు. ఈ సినిమా కోసం కూడా  చాలా హార్డ్ వర్క్ చేశాం. నేపధ్య సంగీతం కూడా చాలా బాగా వచ్చింది.వీరసింహా రెడ్డి లో కూడా స్పీకర్లు పగులుతాయి. జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలని అనిపిస్తుంది. నన్ను ఏం చేయమంటారు.. బాలయ్య గారి కటౌట్ ఎక్కువ మ్యూజిక్ అడుగుతుంది. నేనేం చేయలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు తమన్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version