ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి మీద కేసు ఫైల్ చేస్తే.. అదొక లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పుబట్టారు. శనివారం ఖమ్మం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు.
బీఆర్ఎస్ మంత్రులు ఇష్టానుసారంగా తప్పులు చేసి తామేదో గొప్పలు చేశామని చెప్పుకోవడం సిగ్గేచేటని విమర్శించారు. మంత్రలు చెబితేనే తాము చేశామని అధికారులు ఏసీబీ, ఈడీ విచారణలో స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేసు కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినీ టార్గెట్ చేయడం లేదని వ్యాఖ్యానించారు. చేసిందంతా చేసి కేటీఆర్ దర్యాప్తు సంస్థలను నిందించడం సరికాదని మంత్రి హితవు పలికారు.