హరీష్ శంకర్ పవర్ స్టార్ తర్వాత మెగాస్టార్ తోనేనట ..?

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన దర్శకులందరు దాదాపు సక్సస్ అయిన వాళ్ళే. కృష్ణవంశీ, పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల, హరీష్ శంకర్, అజయ్ భూపతి…ఇలా లిస్ట్ చాలా పెద్దదే. ముంబై లో అయితే ఆ లిస్ట్ నాలుగు రెట్లు ఉంటుంది. ఇక హరీష్ శంకర్ షాక్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత మళ్ళీ రవితేజ తో తెరకెక్కించిన మిరపకాయ్ తో సెటిలయిపోయాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియోట్ చేసింది.

 

అంతేకాదు ఈ సినిమాతో తొలిప్రేమ సినిమా కి వచ్చినంత క్రేజ్ పవన్ కళ్యాణ్ కి రావడం విశేషం. హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీ అంతా మార్మోగిపోయింది. ఇక అల్లు అర్జున్ తో తెరకెక్కించిన దువ్వాడ జగన్నాధం కూడ మంచి పేరు తీసుకు వచ్చింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ని చాలా కొత్తగా చూపించడాన్న పేరు సంపాదించుకున్నాడు. ఇక గబ్బర్ సింగ్ తో శృహాసన్, దువ్వాడ జగన్నాధం తో పూజా హెగ్డేకి లైఫ్ ఇచ్చాడంటే నమ్మి తీరాల్సిందే. ఇవి కాకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ కూడా మంచి వసూళ్ళని రాబట్టింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ సినిమాకి పెద్ద ఎసెట్ అన్న ప్రశంసలు దక్కాయి.

ఇక రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు, క్రిష్ మణిరత్నం ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తారని ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం హరీష్ పవర్ స్టార్ తర్వాత మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయినప్పటికి చిరంజీవి హరీష్ శంకర్ తోను సినిమా చేసే అవకాశం ఉన్నట్టు హింట్ ఇచ్చారు. మొత్తానికి మెగా ఫ్యామిలీతో హరీష్ శంకర్ జర్నీ సక్సస్ ఫుల్ గా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version