కరోనా వైరస్ ఇప్పుడు అందర్నీ సతమతం చేస్తోందని అనేక మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఎవరైనా దగ్గినా, తుమ్మినా వాళ్ల నుండి వ్యాపిస్తుందని మనకి తెలిసిన విషయమే. అయితే కొన్ని స్టడీస్ ప్రకారం గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ తుంపరలు గాలి లో ఉండి అవి గాలి ద్వారా ఇతరులకి సోకుతాయని చెప్పారు.
అయితే ఒక్కసారి కనుక ఎవరైనా రికవరీ అయితే వాళ్ళు మరొకరికి సహాయం చేయడం ముఖ్యం. ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా అనేక మంది ప్లాస్మాను డొనేట్ చెయ్యమని అంటున్నారు. అసలు ప్లాస్మా డొనేషన్ అంటే ఏంటో చూద్దాం…
రికవరీ అయిన కోవిడ్ పేషెంట్ నుండి వైరస్ తో పోరాడిన బ్లడ్ కాంపోనెంట్ అంటే ప్లాస్మాని తీసి బ్లడ్ డొనేషన్ లాగ ప్లాస్మా డొనేషన్ ని ఇస్తారు. ప్లాస్మా ని బ్లడ్ నుంచి తొలగిస్తారు. ఆ మిగిలిన రక్తాన్ని కూడా మీకు ఇచ్చేస్తారు.
దీనిలో రక్తం వృధా ఉండదు. అదే విధంగా దీని వల్ల ye సమస్య ఉండదు ప్లాస్మా డొనేట్ చేసే డోనార్స్ కి ఎటువంటి నొప్పి లేదా ఇబ్బందులు ఉండవు. మీరు కరోనా నుండి రికవరీ అయితే ఇలా సహాయం చేయొచ్చు. దీనితో మరొకరికి సహాయం చేసిన వాళ్లు అవుతారు.