నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల..

-

త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైనవారిని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్స్ కొత్త రిక్రూట్‌మెంట్ (01/2024) నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 27 నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inని సందర్శించి ఆగస్టు 17 ,2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష 13 అక్టోబర్ 2023 నుంచి ప్రారంభమవుతుంది.

దరఖాస్తుదారుడు గణితం, భౌతిక శాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లలో ఒకదానితో కలిపి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడై ఉండాలి. అలాగే ఇంగ్లీష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. డిప్లొమా హోల్డర్ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్‌లతో నాన్ ఒకేషనల్ సబ్జెక్ట్‌లతో కలిపి కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు‌లో ఉత్తీర్ణత సాధించాలి.

వయో పరిమితి: అభ్యర్ధి వయసు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే 2003 జూన్ 27 నుంచి డిసెంబర్ 27, 2006 మధ్య జన్మించి ఉండాలి.

ఎత్తు: దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్ధి ఎత్తు కనీసం 152.5 సెంటీ మీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్ధి ఎత్తు కనీసం 152 సెంటీ మీటర్లు ఉండాలి. పురుష అభ్యర్ధుల చెస్ట్ 77 సెంటీ మీటర్లు ఉండాలి. మరో 5 సెం.మీ వరకు దానిని విస్తరించాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా:
ఫేజ్ 1 ( – ఆన్‌లైన్ రాత పరీక్ష). ఫేజ్ 2 (- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ , ఆడాప్టబిలిటీ టెస్ట్ -1, అడాప్టబిలిటీ టెస్ట 2). ఫేజ్ 3 (మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్) సర్టిఫికేట్ పరిశీలణ ఆధారంగా ఎంపిక ప్రకయ ఉంటుంది.

దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ లో agnipathvayu.cdac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు: రూ. 250

ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 27-/07/2023
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 17/08/2023
ఆన్ లైన్ పరీక్షలు ప్రారంభం: 13/10/2023

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version