ఏఐసీసీ మనసులో ఏముంది..టీ కాంగ్రెస్ చీఫ్ ఎవరికో ఎప్పుడో డిసైడయిందా ?

-

కాంగ్రెస్ లో సాధారణంగా ఏఐసీసీ అదేశాలే పాటిస్తుంటారు. లోకల్ అభిప్రాయం కంటే ఢిల్లీ నిర్ణయాలే ఎక్కువ ఇంప్లీమెంట్ అవుతుంటాయి. అయితే… ప్రస్తుతం తెలంగాణ లో పీసీసీ చీఫ్ ఎన్నికకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియలో అందరి అభిప్రాయాలు తీసుకునే చీఫ్ ఎంపిక జరుగుతుందా..? అనేది ఇప్పుడు ఓపెన్ టాక్. పార్టీ లో ఓ వర్గం మాత్రం… అభిప్రాయ సేకరణ మీద కూడా ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయం తో ఉన్నారు. రెండు రోజులుగా సాగుతున్న అభిప్రాయ సేకరణలో ఎవరు ఎటున్నారు అనేది ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.

మొదటి రోజు అభిప్రాయ సేకరణలో కోర్ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు. సీఎల్పీ నేత భట్టి… పార్టీ సిద్ధాంతాల నుండి వచ్చిన వారికే పీసీసీ ఇవ్వాలని చెప్పారు. ఇక శ్రీధర్ బాబు…అవకాశం ఉంటే నాకు ఇవ్వండి. .లేదంటే ఓ సీనియర్ కి ఇవ్వండి అని చెప్పినట్టు సమాచారం. ఇక సీఎల్పీ లో ఉన్న ఎమ్మెల్యేలలో జగ్గారెడ్డి… కోమటిరెడ్డి కి ఇవ్వండి… అవకాశం ఉంటే నాకైనా ఓకే అంటూనే రేవంత్ కి మాత్రం వద్దని చెప్పేశారు. సీతక్క తప్పించి..మిగిలిన ఎమ్మెల్యే లు ఒక అభిప్రాయము తో ఉన్నారు.

పార్టీలో సీనియర్ నాయకులు గడిచిన కొద్ది రోజులుగా పార్టీ లో సీనియర్ నాయకులు పీసీసీ ఇవ్వండి అని….బయట నుండి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకండి అంటూ సూచన చేశారు. ఇక బీసీ సామాజిక వర్గం నుండి పొన్నాల..పొన్నం ప్రభాకర్.. హన్మంత రావు లాంటి నాయకులు…. బీసీ లకు అవకాశం ఇవ్వండి.. ఎప్పుడూ రెడ్లకే ఇస్తారా..? అని అడిగారు. బీసీ కోటాలో మధు యాష్కీ కి ఎక్కువ మంది మద్దతు ఉంది. ఇక ఎస్సీ..సామాజికవర్గంలో కూడా తన వారికే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. దామోదర రాజనర్సింహ లాంటి నేతలు ఓపెన్ గానే ఠాగూర్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారట.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఠాగూర్ కి రెండు పేజీల లేఖను అందించారు. ఠాగూర్ తో పాటు… ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కి కూడా లేఖను పంపించారు. పీసీసీ అవకాశం తనకే ఇవ్వాలని కోరారు. ఎన్ఎస్ యూఐ నుండి పనిచేస్తున్న… పార్టీ కోసం పని చేస్తా అని చెప్పినట్టు సమాచారం. అయితే నాకు అవకాశం లేకుంటే… పార్టీలో సీనియర్ నాయకుడికి అవకాశం కల్పించండి అని చెప్పుకొచ్చారట. ఇలా పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకునే నాటికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో. డీసీసీ ల అభిప్రాయ సేకరణ ఇంకా జరగాల్సి ఉంది.

గాంధీ భవన్ లో నాయకులంతా అలయ్ బలయ్ వేసుకుంటున్నారు కానీ… ఎవరి మనసులో వారు…ఎవరి ఎత్తుగడాని వాళ్ళు అమలు చేస్తున్నారు. సీనియర్లు అంతా… సీనియర్ కే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి అధిష్టానం ముందే ఫిక్సయిందా లేక అభిప్రాయసేకరణకి ప్రాధాన్యత ఇస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version