జాతీయ స్థాయిలో బలపడాలని చూస్తున్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు గుజరాత్ లో కూడా పాగా వేయడానికి చూస్తోంది. భారతీయ గిరిజన పార్టీ (బిటిపి) తో కలిసి గుజరాత్ మున్సిపల్ ఎన్నికలలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పోటీ చేయనున్నట్లు పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసి శనివారం ప్రకటించారు. గుజరాత్ లోని సూరత్ లో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఓవైసీ నేడు రెండు బహిరంగ సభలలో ప్రసంగిస్తారని ప్రకటించారు. ఒకటి భారుచ్ లో కాగా మరొకటి అహ్మదాబాద్ లో.
ఇక్కడ భారతీయ గిరిజన పార్టీతో మాకు పొత్తు ఉంది. సాయంత్రం అహ్మదాబాద్ లో బహిరంగ సభ కూడా ఉంటుంది” అని ఆయన అన్నారు. AIMIM అధినేత తన పార్టీ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తుందని అన్నారు. “మేము ఇక్కడ ఎన్నికలలో పోటీ చేయడం ఇదే మొదటిసారి, ప్రజలు మాకు ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నాము” అని అన్నారు. గుజరాత్‌లోని ఆరు నగరాల్లో ఫిబ్రవరి 21 నమునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి – అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, జామ్‌నగర్ మరియు భావ్‌నగర్ లలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.