దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంగా క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ అక్కడ గాలి నాణ్యత పడిపోతోంది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకు అక్కడ వాయు నాణ్యత మరింత క్షీణించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక వాహనదారులు, మార్నింగ్ వాకర్స్ సైతం దట్టమైన కలుషిత పొగమంచు కారణంగా నానా అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన పరిమితి కంటే 65 రెట్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏక్యూఐ 507 పాయింట్లతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఒక పరిష్కారం వెతకాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.