ఇనాక్టివ్ ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా డేటా, కాల్స్..!

-

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న నెట్‌వ‌ర్క్‌లో ఇనాక్టివ్‌గా ఉన్న ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. వారికి 3 రోజుల కాల‌వ్య‌వ‌ధితో 1 జీబీ డేటా, ఉచిత ఇన్‌క‌మింగ్‌, ఔట్‌గోయింగ్ కాల్స్ ను అందిస్తోంది. సుమారుగా నెల రోజుల‌కు పైగా ఇనాక్టివ్‌గా ఉన్న యూజ‌ర్లు ఈ ఆఫ‌ర్ ను ఉప‌యోగించుకోవ‌చ్చు. వారిలో ఎంపిక చేసిన క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌స్తుతం ఎయిర్‌టెల్ ఈ ఆఫ‌ర్ కు సంబంధించిన మెసేజ్‌ల‌ను పంపిస్తోంది. అయితే ఇనాక్టివ్‌గా ఉన్న యూజ‌ర్లందరికీ ఈ ఆఫ‌ర్‌ను అందిస్తుందా, లేదా.. అన్న వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు.

కాగా ఇనాక్టివ్ ప్రీపెయిడ్ యూజ‌ర్లు ఈ ఆఫ‌ర్ కింద 1జీబీ హై స్పీడ్ డేటా, ఉచిత కాల్స్ స‌దుపాయం పొంద‌వ‌చ్చు. అయితే 3 రోజుల స‌మ‌యం అయిపోయేలోగా క‌స్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో త‌మ నంబ‌ర్ అలాగే కొన‌సాగుతుంది. అన్‌లిమిటెడ్ ప్యాక్‌ల‌ను రీచార్జి చేసుకుంటే క‌స్ట‌మ‌ర్లు మరిన్ని బెనిఫిట్స్ ను పొంద‌వ‌చ్చ‌ని ఎయిర్‌టెల్ తెలిపింది.

ఇక రూ.48 ప్లాన్ కింద 3జీబీ డేటాను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఇందులో ఎలాంటి కాల్స్ రావు. కేవ‌లం డేటా మాత్ర‌మే వ‌స్తుంది. దీని వాలిడిటీని 28 రోజులుగా నిర్ణ‌యించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version