ఫ్యాన్స్‌ కు స్వారీ చెప్పిన ”మహా సముద్రం” డైరెక్టర్‌ !

-

యంగ్‌ హీరో శర్వానంద్‌ ప్రధాన కథా నాయకుడిగా తెరకెక్కిన సినిమా మహా సముద్రం. ఈ సినిమా ను ఆర్‌ఎక్స్‌ 100 ఫేం దర్శకుడు అజయ్‌ భూపతి.. తెరకెక్కించారు. సిద్ధార్థ్ మరో హీరో గా కనిపిస్తున్న ఈ సినిమాలో అదితీ రావ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమా తో హీరో సిద్ధార్ధ్‌…. తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా బాక్స్‌ఫీసు ముందు… బోల్తా కొట్టింది. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశ కు గురయ్యారు. మొదటి సినిమా హిట్‌ కొట్టిన అజయ్‌ భూపతి… రెండో సినిమా వచ్చే సరిగా కాస్త తడబడ్డాడు. కథలో బలం లేకపోవడం, సన్నివేశాలు ఆసక్తిని కలిగించకపోవడం.. తదితర అంశాల నేపథ్యంలో మహా సముద్రం సినిమా అందరినీ నిరాశ పరిచింది.

ఇక అభిమానులైతే.. తమ అసంతృప్తిని సోషల్‌ మీడియా ద్వారా డైరెక్ట్‌ గా అజయ్‌ భూపతికే తెలిపుతున్నారు. దీంతో తాజాగా అజయ్‌ భూపతి వారందరికీ ట్విట్టర్‌ వేదికగా సారీ చెప్పారు. ” మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. వచ్చే సారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను” అని బదులిచ్చాడు. చాలా మంది ఆర్‌ఎక్స్‌ 100 నుంచి బయటకు వచ్చి వచ్చే మూవీ తీయమని సలహా ఇచ్చారు. మరి దానిని అజయ్‌ భూపతి ఎంత వరకూ పాటిస్తా డో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version