Ajith Kumar: AK 61 మామూలుగా ఉండదు..అజిత్ కుమార్ అదిరిపోయే లుక్

-

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణమైన నటుడిగానే కాదు వ్యక్తిగానూ పేరు సంపాదించుకున్న ఈ హీరో నటించిన ‘వలిమై’ చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ విలన్ రోల్ ప్లే చేశారు.

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అజిత్ కుమార్ నెక్స్ట్ సినిమాలపైన ఫోకస్ చేస్తూనే ఉంటారు. అలా అజిత్ తన నెక్స్ట్ మూవీ పైన ఫోకస్ చేశారు. అజిత్ – వినోద్ కాంబోలో సినిమా తెరెక్కుతుండగా, బేవ్యూ బ్యానర్ పై బోనీ కపూర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. AK61 ఫిల్మ్ షూట్ ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ లో ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలోనే అజిత్ కుమార్ సినిమా కోసం నయా అవతారమెత్తారు. తెల్లటి జుట్టు, గడ్డంతో రేబాన్ గ్లాసుల్లో అజిత్ కుమార్ చాలా స్టైలిష్ గా కనబడుతున్నారు. ప్రజెంట్ ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఏకే 61 సినిమా స్టోరి ఉండబోతున్నదని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి,జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉండబోతుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version