న‌టుడు సునీల్‌పై ఆకాష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. త‌న ప‌ట్ల సునీల్ అలా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌..!

-

అందాల రాముడు సినిమా సమయంలో సునీల్‌ తనను బతిమాలాడని.. అందుకే ఆ సినిమాలో రెండో హీరోగా చేశానని ఆకాష్‌ తెలిపాడు. అయితే ఆ మూవీలో నటించేందుకు తాను ఒక తమిళ మూవీని వదులుకోవాల్సి వచ్చిందన్నాడు.

రామ్మా చిలకమ్మా.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు.. ఆకాష్‌.. తరువాత వచ్చిన ఆనందం మూవీతో హిట్‌ కొట్టినా.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతను అడపా దడపా.. పలు సినిమాల్లో గెస్ట్‌ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా ఆకాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. నటుడు సునీల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సునీల్‌ తన పట్ల ఒకప్పుడు ఏవిధంగా ప్రవర్తించాడో ఆకాష్‌ చెప్పుకొచ్చాడు.

అందాల రాముడు సినిమా సమయంలో సునీల్‌ తనను బతిమాలాడని.. అందుకే ఆ సినిమాలో రెండో హీరోగా చేశానని ఆకాష్‌ తెలిపాడు. అయితే ఆ మూవీలో నటించేందుకు తాను ఒక తమిళ మూవీని వదులుకోవాల్సి వచ్చిందన్నాడు. అయినప్పటికీ అందాల రాముడు మూవీ పోస్టర్లలో తన స్టిల్‌ కనిపించలేదని ఆకాష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక అందాల రాముడు మూవీ హిట్‌ అయ్యే సరికి సునీల్‌ తన గురించి ఎక్కడా చెప్పలేదని కూడా ఆకాష్‌ అన్నాడు. స్టేజీలపై సునీల్‌ తన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆకాష్‌ తెలిపాడు. అంతకు ముందు సునీల్‌ తనను భయ్యా.. అని పిలిచేవాడని.. అందాల రాముడు తరువాత తనను ఏయ్‌.. ఆకాష్‌.. అని పిలవడం ప్రారంభించాడని అన్నాడు. సునీల్‌ తనను అలా నిర్లక్ష్యం చేయడం, తనను పట్టించుకోకపోవడం, అతనలా మారిపోవడం.. తనకు బాధ కలిగించిందని ఆకాష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆకాష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version