క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గత మూడేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. కథలు పట్టుకుని తిరుగుతున్నా ఏ హీరో, నిర్మాత అవకాశాలివ్వడం లేదు. చందమామ తర్వాత చెప్పుకోదగ్గ ఒక్క హిట్ కూడా లేదు. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హీరోలు, నిర్మాతలు అతను ఔట్‌డేటెడ్ అయిపోయాడని డిసైడ్ అయిపోయారు. నమ్మకం కోల్పోయారు. బాలయ్య 100వ సినిమా కోసం స్కెచ్ వేసాడు గానీ పనవ్వలేదు. రైతు కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి రెడ్ సిగ్నల్ వేసాడు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ బాలయ్యను కదినిపనప్పుడల్లా…అదిగో చేద్దాం..ఇదిగో చేద్దాం అని వాయిదా వేస్తున్నాడు.
ఇక చిరంజీవి ప్లాప్ డైరెక్టర్లను పట్టించుకోడు కాబట్టి అతను ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. మా కృష్ణవంశీతో సినిమా ఎన్నో సార్లు చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయానని సరిపెడతారు. ఇక మిగతా హీరోలైతే ముందుకొచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం కృష్ణవంశీ వందేమాతరం అనే కథ పట్టుకుని తిరుగుతున్నాడు. అయితే ఈ కథను బండ్ల గణేష్ అలియాస్ బ్లేడ్ గణేష్ ఒకే చేసాడని తాజాగా ఆయన సన్నిహిత వర్గాల నుంచి కొద్ది సేపటి క్రితమే తెలిసింది. దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడుట. ఇది ఖడ్గం తరహాలో ఉండే కథ అని సమాచారం. అందుకే టైటిల్ వందేమాతరంగా పెట్టారుట. ఇక హీరో ని సెట్ చేసే బాధ్యతని కూడా గణేష్ తీసుకున్నాడుట.
మరి గణేష్ ఏ రేంజ్ హీరోని తీసుకొస్తాడో చూడాలి. ప్రస్తుతం గణేష్ కూడా యాక్టివ్‌గా లేడు. తెలంగాణ రాష్ర్టంలో ఎన్నికల సమయంలో రాజకీయాలలో తలదూర్చాడు. కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానని సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాడు. తర్వాత కొన్ని నెలలకి ఆ పార్టీకి దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలొచ్చాయి. కొన్ని నెలలుగా ఆ ప్రయత్నాల్లోనే బిజీ అయ్యాడు. చివరిగా కృష్ణవంశీ కథను లాక్ చేసి పెట్టాడు. ఈ సినిమా పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.