టాలీవుడ్ లో వారసత్వంగా నటుడిగా కెరీర్ ను ఆరంభించిన వారిలో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ఒకరు. ఇప్పటికే నాగ చైతన్య తానేమిటో నిరూపించుకుని ఒక స్థాయిలో ఉన్నాడు. కానీ అఖిల్ విషయంలో మాత్రం నాగార్జునకు ఆ తృప్తి లేదని చెప్పాలి. ఇప్పటి వరకు అఖిల్ కెరీర్ లో 4 సినిమాలు చేసినా హిట్ మాత్రం దక్కలేదు. ఒక్క “మోస్ట్ ఎలిజ్బిల్ బ్యాచిలర్” మాత్రమే పర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఏజెంట్ అనే సినిమాను గత మూడు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్నారు.
“ఏజెంట్” ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్: మరికాసేపట్లో ట్రైలర్ రిలీజ్… ఫ్యాన్స్ మోస్ట్ అవైటింగ్ !
-