మామూలుగా లేదుగా… “ఏజెంట్ ” నుంచి అఖిల్ బీస్ట్ లుక్

-

అక్కినేని అఖిల్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ యంగ్ హీరో.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాతో ఈ మధ్య బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో చక్క చక్క తన తదుపరి చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కు ఇటీవలే… ఏజెంట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ వైరల్ గా మారింది. దర్శకుడు సురేందర్రెడ్డి కోసం ఏజెంట్ గా మారిన ఈ హీరో… ఈ సినిమా కోసం సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారి అందరికి సాగించాడు. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరోమారు తన కండలు తిరిగిన దేహంతో ఫోటోకి ఫోజులు ఇచ్చి అమ్మాయిలకు మన్మధుడి గా మారాడు. “2022 లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు లైట్ యువర్ ఫైర్ “అంటూ చొక్కా లేకుండా దిగిన ఫోటోలు షేర్ చేశాడు అఖిల్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version