స్టార్ డైరెక్ట‌ర్ల‌ను లైన్‌లో పెడుతున్న అఖిల్‌.. మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో!

-

అక్కినేని అఖిల్ స్టార్ హీరో రేంజ్‌లో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. కానీ మ‌నోడి బ్యాడ్‌ల‌క్ ఏంటంటే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కూడా ప‌డ‌లేదు. దీంతో అక్కినేని ఫ్యామిలీ తీవ్ర నిరాశ ప‌డింది. అయినా స‌రే మ‌నోడు మాత్రం సినిమాల‌ను ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. త‌న‌కు ఎలాగైనా స్టార్‌డ‌మ్ రావాల‌ని స‌క్సెస్ ఫుల్ స్టార్ డైరెక్ట‌ర్ల‌ను ఒప్పించి మ‌రీ సినిమాలు చేస్తున్నాడు.

ఇప్ప‌టికే క్రియేటివ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డిని ఒప్పించి మ‌రీ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో చాలా డిఫ‌రెంట్ లుక్‌లో కనిపించ‌నున్నాడు అఖిల్‌. ఇప్పుడు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ను కూడా లైన్ లో పెడుతున్నాడు.

కొర‌టాల శివ‌కు అప‌జ‌య‌మే లేదు. ఆయ‌న తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లే. దీంతో ఆయ‌న‌తో సినిమా చేసేందుకు అఖిల్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌తో సినిమా చేస్తే ఆటోమేటిగ్‌గా స్టార్‌డ‌మ్ వ‌చ్చేస్తుంద‌ని న‌మ్ముతున్నాడు. అయితే కొర‌టాల ఇప్పుడు ఆచార్య‌, ఎన్టీఆర్‌తో సినిమాలు చేస్తున్నాడు. మ‌రి ఇవన్నీ పూర్త‌య్యాక అఖిల్‌తో చేస్తాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version