ఎన్టీరామారావుకి ఆ పాత్ర అంటే విపరీతమైన ఇష్టమట..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారకరామారావు ఎంతో మందికి ఆదర్శం అని చెప్పవచ్చు. ఇక సుమారుగా 50 సంవత్సరాలపాటు మూడు తరాల ప్రేక్షకులను అసమాన అభినయంతో మెప్పించిన ఈయన ఏ పాత్రనైనా అవలీలగా పోషించే సామర్ధ్యాన్ని కలిగి ఉండేవారు. ఇకపోతే నవరసాలను అలవోకగా పండించగల నైపుణ్యం ఉన్న ఆయనను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు కాబట్టే అవి ఈయనను మహానటుడిని చేశాయి.ఇకపోతే మే 28వ తేదీన ఆయన శతదినోత్సవ జయంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన పాత్ర ఏమిటో..? గతంలో ఆయనే స్వయంగా తెలియజేసినట్లు ప్రకటించారు. 1958లో భూకైలాస్ చిత్రం ద్వారా రావణుడి పాత్ర ధరించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ స్ఫూర్తితోనే సీతారామ కళ్యాణం సినిమా లో కూడా రావణుడి పాత్ర వేశారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఇక 1961 జనవరి 6వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆంధ్ర సచిత్ర వార్త పత్రికలో నా అభిమాన పాత్ర రావణ అనే వ్యాసాన్ని స్వయంగా ఆయన రాసుకున్నారు. మొత్తానికి అయితే ఎన్నో జానపద సాంఘిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు రావణుడి పాత్ర అంటే ఎనలేని ఇష్టమట.

ఇక నందమూరి తారకరామారావు స్వర్గస్తులైన తర్వాత ఆయన లోటును ఎవరూ తీర్చలేక పోయారు. ఇక ప్రస్తుతం ఆయన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజికి ఎదిగి అటు కమర్షియల్ హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన నటనతో ప్రతిభ తో తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నారు జూనియర్ రామారావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version