దేశంలో మళ్లీ కోవిడ్ తీవ్రత పెరుగుతోంది. గత రెండు రోజుల నుంచి కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. రెండు రోజుల క్రితంతో పోలిస్తే తాజాగా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2628 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ తో బాధపడుతూ 18 మంది మరణించారు. ఒక్కరోజే 2167 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
ప్రస్తుతం దేశంలో 15,414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో 4,31,44,820 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 5,24,525 మంది మరణించగా… 4,26,04,881 మంది కోలుకున్నారు. ఇదిలా ఉంటే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు అర్హులైన వారికి 192,82,03,555 డోసుల వ్యాక్సినేషన్ అందించారు. నిన్న ఒక్క రోెజే 13,13,687 టీకాలు అందించారు. ఇదిలా ఉంటే కొత్తగా పుట్టుకొస్తున్న బీఏ.4, బీఏ.5 వేరియంట్లు ప్రజల్లో కలవరాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ కు సంబంధించిన కేసులు ఇండియాలో బయటపడ్డాయి.