అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…. ‘ థాంక్యూ’ టీజర్ వచ్చేది అప్పుడే

-

అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. అక్కినేటి యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ థాంక్యూ’ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ పై లేటెస్ట్ న్యూస్ చెప్పింది. ఈ నెల 25న సాయంత్రం 5.04 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చైతన్య డబ్బింగ్ చెబుతున్న వీడియోను షేర్ చేసింది సినిమా యూనిట్.

ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ దర్శకత్వం వహించగా… దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నాడు. రాశీ ఖన్నాతో పాటు అవికాగోర్, మాళవిక నాయర్ లు థాంక్యూ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే విక్రమ్ కే కుమార్ ‘ మనం’ సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి బిగ్ హిట్ ఇచ్చాడు. తాజాగా మరోసారి నాగచైతన్యతో సినిమా తీస్తున్నాడు. సంక్రాంతి బరిలో నిలిచిన ‘ బంగార్రాజు’ సినిమా హిట్ తో నాగచైతన్య మంచి ఫామ్ లో ఉన్నాడు. తాజాగా వస్తున్న థాంక్యూ సినిమా నాగచైతన్యకు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version