భారీ రేటుకు అమ్ముడైన‌ ‘అల వైకుంఠపురములో’ డిజిటల్ రైట్స్‌..

-

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ‘నెట్ ఫ్లిక్స్’వారు సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.

అందుకు సంబంధించిన లావాదేవీలు ఆల్రెడీ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ సినిమాలో ‘టబు’ కీలకమైన పాత్రను పోషించడం విశేషం. ఇప్పటికే పూజా హెగ్డే స్టార్ డమ్ తో పాటు ఆమె పారితోషికం ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆమె డేట్స్ దొరకడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. కాగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వచ్చి మంచి విజయాలు సాధించాయి. ఈ నేప‌థ్యంలోనే అల వైకుంఠ‌పుర‌ములో సినిమాపై సైతం భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version