దాదాపు ఏడు నెలల నుంచి దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి వైరస్ ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కంట్రోల్ కావడం లేదు అన్న విషయం తెలిసిందే. రోజురోజుకు శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతోంది. ధనిక పేద అనే తారతమ్యం లేకుండా సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడగా ఇటీవలే బీహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోడీ కరోనా వైరస్ బారిన పడ్డారు ఇక ఇటీవల కరోనా వైరస్ లక్షణాల తో బాధపడిన ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన బీహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోడీ తనకు పాజిటివ్ అని వచ్చిందని తనతో గత కొన్ని రోజుల నుంచి సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. త్వరగా కోలుకొని బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను అంటూ తెలిపారు.