సినిమా ఛాన్సులు లేక.. బాలయ్య హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?

-

తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్గా కొనసాగి ఆ తర్వాత అవకాశాలు లేక ప్రేమ వివాహం చేసుకుంది నమిత. ముఖ్యంగా నమిత అందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అనడంలో అతిశయోక్తి లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన జెమిని సినిమా లో క్యూట్ క్యూట్ గా కనిపించిన నమిత ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహ సినిమాలో ఎన్నో ఏళ్ల తర్వాత పూర్తిగా మారిపోయి బల్కి బ్యూటీగా అందరిని ఆశ్చర్యపరిచింది.

అయితే పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో బీజేపీలో చేరిన నమిత అక్కడ కూడా కలిసి రాకపోవడంతో మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే అవకాశాలు లేకపోవడంతో నిర్మాతగా అవతారం ఎత్తింది బల్కి బ్యూటీ. ప్రస్తుతం తానే ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాను నిర్మిస్తున్నట్లు ఇటీవలే నమిత ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఫస్ట్లుక్ కూడా ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది నమిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version