SBI కస్టమర్లకు హెచ్చరిక..ఆగస్టు 6, 7 తేదీల్లో ఆన్ లైన్ సేవలు బంద్ !

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల కోసం ఆ బ్యాంక్‌ ఓ కీలక ప్రకటన చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యోనో మొబైల్ అప్లికేషన్ కు సంబంధించిన ఆన్‌ లైన్‌ సేవలకు రెండు రోజుల పాటు కాస్త అంతరాయం కలుగుతుందని ప్రకటించింది.

ఆగస్టు 6 వ తేదీ అర్థరాత్రి అంటే… 10:45 నిమిషాల నుంచి ఆగస్టు 7 మధ్యాహ్నం 1:15 నిమిషాల వరకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన ఆన్‌ లైన్‌ సేవలకు అంతరాయం కలుగుతందని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యోనో మొబైల్ అప్లికేషన్ నిర్వహణ పనుల కారణంగా ఆగస్టు 6 న అర్థరాత్రి మరియు ఆగస్టు 7న మధ్యాహ్నం వరకు ఆన్‌ లైన్‌ సేవలకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. అయితే.. ఈ సౌకర్యంపై తాము చింతిస్తున్నట్లు…స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ బ్యాంక్‌ లావాదేవీలు పూర్తి చేయాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version