18ఏండ్ల లోపు పిల్లలకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా: ఎవరికి వర్తిస్తుందంటే?

-

కొవిడ్-19 మహమ్మారి చాలా మంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. కొందరు ఆప్తులను కోల్పోతే.. మరికొందరు ఆస్తులను పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది చిన్నారులు అనాథలయ్యారు. కొవిడ్-19 బారిన పడిన కుటుంబాల కోసం చేపట్టిన ఉపశమన చర్యల్లో భాగంగా రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Free health insurance | ఉచిత ఆరోగ్య బీమా

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) కింద కొవిడ్-19 బాధిత కుటుంబాలకు చెందిన 18ఏండ్ల లోపు పిల్లలకు రూ.5లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం కల్పించనున్నది. ఈ పథకం ద్వారా 13 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నట్లు పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కొవిడ్-19 కారణంగా ప్రభావితమైన చిన్నారుల సంరక్షణలో భాగంగా పీఎంజేవై కింద కల్పించే రూ.5లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పీఎం కేర్ నిధుల నుంచి చెల్లిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి, ఆదాయా మార్గాల ప్రాతిపదినక ఉచిత ఆరోగ్య బీమా కోసం లబ్ధిదారుల కుటుంబాలను ఎంపిక చేయనున్నారు. హెల్త్ ఇన్సూనెర్స్ ప్రీమియాన్ని పీఎం-కేర్స్ నుంచి చెల్లించనున్నారు. దీనివల్ల పిల్లలు ద్వితీయ, ఆ తర్వాతి స్థాయి హాస్పిటల్‌లో సేవలు పొందడానికి వీలు కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version