తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే?

-

తెలంగాణాలోని ఇంజినీరింగ్ కాలెజీల ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్షల ను నిర్వహించారు.. ఆ పరీక్షలు నిన్నటి తో పూర్తి అయ్యాయి. ఈ నెల 18న ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజుల్లో నిత్యం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఇంజనీరింగ్ కు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు..

కాగా, అగ్రికల్చర్ సీట్లకు సంబంధించిన ఎంసెట్ పరీక్షలు ఇంకా నిర్వహించలేదు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ.. భారీ వర్షాల నేపథ్యం లో ఈ పరీక్షలను ఈ నెల 30, 31 తేదీలకు వాయిదా వేశారు.. ఈ పరీక్షలు పూర్తీ అయిన వెంటనే వీటి రిజల్ట్స్ గురించి అందరి ఫోకస్ పడుతోంది..వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముత్తం పూర్తి చేసి ఫలితాల ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఆగస్టు 8వ తేదీలోగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ఆలస్యమైనా.. 10వ తేదీలోగా ఫలితాలను విడుదల చేయనున్నారు అధికారులు.. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు రేపటి నుంచి అంటే జులై 21 నుంచి ప్రారంభమై.. ఈ నెల 30వ తేదీన ముగియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.. ఇప్పుడు వాయిదా పడిన పరీక్షలు అన్నీ కూడా జులై 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. అయితే, పరీక్షలను ఎందుకు వాయిదా వేశారు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు…

Read more RELATED
Recommended to you

Exit mobile version