తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను పంపిణీ చేయడానికి సిద్ధం అవుతుంది. ఐదేళ్ల లోపు చిన్నారులు అందిరికీ.. పల్స్ పోలియో చుక్కలు వేయాలని తల్లి దండ్రులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామంలో పల్స్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
అలాగే ప్రయాణాల్లో ఉండే వారికి కూడా బస్ స్టేషన్ లలో కూడా పల్స్ పోలియో కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,331 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38,31,907 మంది ఐదేళ్ల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలకు పైగా పల్స్ పోలియో డోసులను సిద్దం చేసింది. సంచార జీవితం గడిపే వారికి కూడా పల్స్ పోలియో అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు ప్రత్యేకంగా బృందాలను కూడా ఏర్పాటు చేసింది.