ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. బీసీ కులాలకు సీఎం జగన్ చేసింది ఏమీ లేదన్నారు. జగన్ కు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారని.. వచ్చే ఎన్నికలలో ఆ తప్పుని సరిదిద్దుకోవాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడుకునేందుకు బీసీలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా సీఎం జగన్ కి లేదన్నారు అయ్యన్నపాత్రుడు. స్థానిక సంస్థల్లో బీసీలకు 10% రిజర్వేషన్లు కోత విధించి మోసం చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు పూర్వవైభవం వస్తుందన్నారు. ఐదుగురు రెడ్డి సామంత రాజులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.