Dhamki first single: విశ్వక్ సేన్ “ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా” సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘ధమ్కి’ మూవీ చేస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్రం బృందం.

లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ ” ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా ” సాంగ్ ని డీజే టిల్లు ఫెమ్ సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా విడుదల చేశారు. బీచ్ లో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, పృధ్విరాజ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ జోన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version