లాక్ డౌన్ కావాలంటున్న సీఎంలు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. రోజు రోజుకి దాదాపు 1500 పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా పెరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు ఇప్పుడు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి.

దీనితో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ విషయంలో వెనక్కు తగ్గితే మంచిది కాదు అనే అభిప్రాయానికి వచ్చినట్టే కనపడుతుంది. కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో కూడా ఆయన లాక్ డౌన్ లేకపోతే మరింత నష్టం ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనితో వాళ్ళు కూడా లాక్ డౌన్ ఉంచడమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చినట్టు కనపడుతుంది. సిఎంలతో జరిగిన సమావేశంలో కూడా మోడీ ఇదే చెప్పారు.

వాళ్ళు కూడా లాక్ డౌన్ ని కొనసాగించడమే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఏపీ సిఎం జగన్ కూడా లాక్ డౌన్ ఉంచాలి అని మోడిని కోరినట్టు సమాచారం. త్వరలోనే మరిన్ని కేసులు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి లాక్ డౌన్ లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అర్ధం చేసుకోవాలని మోడీ విజ్ఞప్తి చేసారని, దీనికి సిఎం లు కూడా అంగీకారం తెలిపారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version