Big News: రేపే తేలనున్న మునుగోడు భవితవ్యం.. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

-

భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 93-మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి ఈ నెల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈవిఎమ్ లలో భద్ర పరచబడిన ఓటర్ల నిర్ణయాన్ని తెలిపే ఓట్ల లెక్కింపు 06.11.2022 ఉదయం 8.00 గంటల నుండి ప్రారంభమవుతుంది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 241805. 03.11.2022న పోల్ అయిన మొత్తం ఓట్లు 225192. ఇందులో పోస్టల్ బాలేట్ ద్వారా వచ్చిన ఓట్లను కలుప లేదు. ఈవిఎం లలో జరిగిన పోలింగ్ 93.13 శాతంగా నమోదయ్యింది. 80పైబడి వృద్దులు మరియు దివ్యాంగుల నుండి మొత్తం 739 పోస్టల్ బ్యాలెట్ కి దరకాస్తులు వస్తె అందులో 686 వచ్చాయి మంది పోస్టల్ బాల్లెట్ ను వినియోగించుకున్నారు. 04.11.2022 నాటికి సాయుధ బలగాలకు (సర్వీస్ ఓటర్స్) సంబందించి పోస్టల్ బ్యాలట్, మొత్తం 50కి గాను 6 అందినవి. నల్గొండలోని అర్జాల బావిలోని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఓట్ల లెక్కింపు తేది 06.11.2022న ఉదయం 08.00 గంటలకు ప్రారంభమవుతుంది. పోల్ చేయబడిన EVMS (A&B కేటగిరీ) ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను తేది 06.11.2022 ఉదయం 7.30 గంటలకు ఎన్నికల కమీషన్ పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో తెరవబడుతుంది. కమిషన్ సూచనల మేరకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడతారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం మొత్తం 2 టేబుల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. పోస్టల్ బ్యాలెట్‌తో పాటు సర్వీస్ ఓటర్ల ఓట్లను ఎన్నికల కమీషన్ యొక్క ఈటీపీబీఎస్ సాఫ్టువేర్ ద్వారా లెక్కింపు కూడా చేపడతారు. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల కౌంటింగ్ మొత్తం 21 టేబుల్ లను కమిషన్ ఆమోదంతో ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు మొత్తం 21 టేబుల్లలో మొత్తం 14 రౌండ్లు (14 పూర్తి రౌండ్లు, 294 పోలింగ్ స్టేషన్లు) మరియు 15వ రౌండ్ 4 టేబుల్లలో జరుగుతుంది.

 

EVM కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఎన్నికల నిబంధనావలి 1961 యొక్క నియమం 56 (D) ప్రకారం లెక్కించుటకు అనుమతించిన మరియు కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని ప్రదర్శించని పోలింగ్ స్టేషన్‌లను మినహాయించి డ్రా పద్దతి ద్వారా తప్పనిసరిగా 5 పోలింగ్ స్టేషన్ల VVPAT ల స్లిప్‌లను VCB (VVPAT కౌంటింగ్ బూత్) నందు లెక్కించబడును . 150 మంది సీటింగ్ కెపాసిటీతో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా రెండింటికీ ప్రత్యేక హాలు ఏర్పాటు చేయబడింది . ఓట్ల లెక్కింపు రోజు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించటమైనది. వారిలో 100 మంది సిబ్బందిని కేవలము ఓట్ల లెక్కింపు కోసము మరియు 150 మంది సిబ్బందిని ఇతర కార్యకలాపాల కోసం నియమించటమైనదని ఈ మేరకు ఎన్నికల సంఘం పత్రిక ప్రకటనను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version