టాటా సర్వీసులన్నీ ఒకే యాప్ లో.. ఆఫర్లు, యూపీఐ పేమెంట్స్ కూడా..!

-

టాటా గ్రూప్ నుంచి సూపర్ యాప్‌ టాటా న్యూ వస్తోంది. ఈ యాప్ త్వరలోనే రానుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో భాగంగా టాటా గ్రూప్ ఉద్యోగులు కొంతకాలంగా ఈ యాప్‌ను వాడుతున్నారు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. టాటా న్యూ యాప్‌ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోచ్చు.

 

ఈ ఒకే యాప్ తో అన్ని టాటా సంస్థల సర్వీసులని పొందొచ్చు. నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పేమెంట్స్ దగ్గరి నుంచి విమాన టికెట్ల వరకు అన్నింటినీ ఈ సింగిల్ యాప్ తో పొందుచు. పైగా ప్రత్యేకమైన ఆఫర్లు, రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి. ఇవన్నీ యునిఫైడ్ ప్లాట్‌ఫామ్ Tata Neu లో పొందొచ్చు.

బిగ్ బాస్కెట్, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ కోసం టాటా క్లిక్, ఎలక్ట్రానిక్స్ కోసం క్రోమా, విమాన టికెట్ల కోసం ఎయిర్ ఏషియా ఇండియా, దుస్తుల షాపింగ్ కోసం వెస్ట్‌సైడ్‌తో పాటు అన్నింటినీ కూడా ఈ యాప్ ద్వారా మనం పొందొచ్చు. ఇది ఇలా ఉంటే టాటా ప్రొడక్టులను ఆన్‌లైన్‌లోకానీ ఆఫ్‌‌లైన్‌లో కానీ ఈ యాప్‌ ద్వారా కొంటే న్యూ కాయిన్స్ అనే రివార్డు పాయింట్లు వస్తాయి.

విద్యుత్ బిల్లులు, ప్రీపెయిడ్ రీచార్జ్‌లు, పోస్ట్ పెయిడ్ బిల్లులు సహా దాదాపు అన్ని యుటిలిటీ బిల్లులు కూడా పే చెయ్యచ్చు. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సపోర్ట్ ఉండే టాటా పే ఉంటుంది. యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version