గాంధీ ఆలోచన విధానాలకు విరుద్ధంగా బిజెపి పరిపాలన కొనసాగిస్తోందని అన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. దేశ సంపదనంతా ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కట్టబెడుతూ ప్రజలను నిరుపేదలుగా మారుస్తోందని ఫైర్ అయ్యారు. గాంధీ జయంతిని నిర్వహించే నైతిక హక్కు బిజెపికి లేదని ఆరోపించారు. కులం, మతం పేరుతో దేశ ప్రజలను విడదీయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఓవైపు జాతిపిత అంటూనే.. ఆయన ఆలోచనలకు భిన్నంగా పాలన చేస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో భాగంగానే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారని తెలిపారు. త్వరలోనే రాహుల్ యాత్ర రాష్ట్రంలోకిి ప్రవేశిస్తుందని, ప్రజలందరూ ఆ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. మల్లికార్జున ఖర్గే సమర్థవంతమైన నాయకుడని.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడని స్పష్టం చేశారు. ఇక కెసిఆర్ ఫ్లైట్ కొనడం పై అది ఆయన వ్యక్తిగత విషయమని.. ఆయన కొత్త పార్టీ గురించి ఇప్పుడే మాట్లాడలేమని స్పష్టం చేశారు.