ఇప్పడు సెలబ్రెటీల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకూ అంతా.. టాటూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇందులో బోలెడు రకాలు ఉన్నాయి. నేమ్స్, సింబల్స్ ఇలా తమకు ఇష్టమైనవి వేయించుకుంటున్నారు. ఒకటి రెండూ వేయించుకోవడం అయితే కామన్ అయిపోయింది. అసలు బాడీ అంతా టాటూస్ ఉంటే.. దాన్ని ఏమనాలి ఇక.. పిచ్చా, ప్రేమ. లేదా పిచ్చిప్రేమ. మనిషేనా అనిపిస్తుంది.. అతని టాటూస్ చూస్తే.. దేవుడి ఇచ్చిన అందమైన శరీరాన్ని టాటూస్‌తో నింపేశాడా వ్యక్తి. నిజానికి అతని టాటూస్‌తో బాగా ఫేమస్ కూడా అయ్యాడండోయ్.. మీరు ఇతన్నీ చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
848 స్క్వేర్ (చతురస్ర) టాటూలు… ఎవరైనా అలా వేయించుకోవాలని అనుకుంటారా… అతను అనుకున్నాడు. ఒళ్లంతా వేయించుకున్నాడు. పేరు మాట్ గోన్ (Matt Gone). ఈ టాటూల వల్ల అతను వరల్డ్ ఫేమస్ అవ్వడమే కాదు.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించాడండి.. 2014లో ఈ రికార్డ్ అతని పేరున నమోదైంది.
2014లో గిన్నీస్ రికార్డ్ కోసం ఇద్దరు డాక్టర్లు మాట్ గోన్ ఒంటిపై ప్రతీ చదరపు టాటూనీ కౌంట్ చేశారు. ఆ రికార్డ్ తర్వాత కూడా మరో 30 టాటూల దాకా వేయించుకున్నాడు. అవి కూడా స్క్వేర్‌లే. అయితే.. అన్ని టాటూలు వేయించున్నా ఏది నొప్పి అనిపించలేదు కానీ.. ముక్కు, చేతి వేళ్లు, కాలి వేళ్లు మీద టాటూ వేస్తుంటే విపరీతమైన నొప్పి కలిగిందట.! ముక్కుకు టాటూ వేశాక… 20 నిమిషాలపాటూ… బ్లాక్ ఇంకును చీదుతూనే ఉన్నాడట. ఆ బాధ వర్ణాణాతీతం అట.
మాట్.. మొదటి టాటూను 1985లో వేయించుకున్నాడు. ప్రస్తుతం అతని నాలిక, కళ్లలోపల కూడా టాటూలున్నాయి. వీటిలో బ్లూ, గ్రీన్, మాజెంటా, గోల్డ్ కలర్‌వి ఉన్నాయి. మాట్ పుట్టినప్పుడు కొన్ని లోపాలతో పుట్టాడు. వాటిని కనిపించకుండా చేసుకోవాలని టాటూ వేయించుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అదే ఫ్యాషన్ అయిపోయింది.
కళ్ల లోపల కూడా టాటూ..
కళ్ల లోపల టాటూ వేయించుకోవడం చాలా నొప్పిగా అనిపించిదట.. సాధారణంగా ప్రజలు కను రెప్పల వరకే టాటూ వేయించుకుంటారు కని.. మాట్ వివరించాడు. మాట్ ప్రకారం కళ్ల లోపల టాటూ వేయించుకున్న వారిలో తను ఆరోవాడట. నాలుక మీద 2010లో హైపోడెర్మిక్ ఇంజెక్షన్లతో టాటు వేశారట. తన గొంతువరకూ టాటూ ఉంది. ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయొద్దంటున్నా ఈ టూటూ మ్యాన్.!
అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు అనేది చెప్పలేదు కానీ మొత్తానికి ఒక వింత మనిషి అయిపోయాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో.!