“ పీఎం ఆవాస యోజన” కింద ఏపీకి 20 లక్షల TIDCO ఇండ్ల కేటాయింపు

-

ఢిల్లీః “ప్రధానమంత్రి ఆవాస యోజన” పథకం క్రింద దేశంలోనే అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ కు 20 లక్షల TIDCO గృహల కేటాయించింది కేంద్రం. ఈ రోజు రాజ్యసభలో బిజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “ప్రధాన మంత్రి ఆవాస్ యోజన” పథకం కింద APTIDCO చేత నిర్మించి, లబ్ధిదారులకు ఇచ్చిన గృహాల వివరాలు సమర్పించారు బిజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

వాటి నిర్మాణంలోనీూ, వాటిని లబ్ధిదారులకు అందజేయడంలో జరిగినటువంటి ఆలస్యానికి గల కారణాలను తెలియజేయాలంటూ అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై లక్షల నలభై నాలుగు వేల గృహాలను “ప్రధాన మంత్రి పట్టణ ఆవాస్ యోజన” కింద కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.

దేశంలోనే అత్యధిక కేటాయింపు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వటం జరిగిందని.. మొత్తం 17 లక్షల 4 వేల 366 గృహాలు నిర్మాణం జరుగగా, వాటిలో ఇప్పటివరకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు గృహాలను పూర్తిచేయటం జరిగిందని వెల్లడించారు. వీటి నిర్మాణం నిమిత్తం ఇప్పటివరకు కేంద్రం 31వేల 88 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వము కేటాయించగా వాటిలో ఇప్పుడు వరకు 11,755 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేయడం జరిగిందని కేంద్రమంత్రి తెలియజేశారు.
జిల్లాల వారీ గా కేంద్రం చే TIDCO గృహాల కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version