ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాన్స్ అయితే ఏమాత్రం తగ్గకుండా.. ఒకరిని మించి మరోకరు తమ హీరో ఫొటోలు ఎడిట్ చేసి మరీ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే.. బన్నీ ఎన్టీఆర్ చెప్పిన విషెస్ ఇవాళ ప్రత్యేకంగా నిలిచింది. జన్మదిన శుభాకాంక్షలు బావా అంటూ ఎన్టీఆర్ విష్ చేయగా.. థ్యాంక్స్ బావా అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు.
దానికి ఎన్టీఆర్ బదులిస్తూ.. పార్టీ లేదా? పుష్ప అని మరో ట్వీట్ పెట్టారు. దానికి బన్నీ రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఎన్టీఆర్, బన్నీ బాండింగ్ చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, బన్నీ ట్వీట్లను రీట్వీట్లు చేస్తూ.. కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప 2 ఫస్ట్ లుక్స్ ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. అమ్మోరునే అలంకరిస్తూ అన్నట్లు బన్నీ మేకోవర్ కు ఫ్యాన్స్ మొత్తం షాక్ అయ్యింది. ఊహించని విధంగా ఉన్న ఈ లుక్ పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది సోషల్ మీడియాలో. అల్లు అర్జున్ మెడలో నిమ్మకాయలు, ఒంటికి రంగులు, కళ్లకు కాటుక.. అమ్మవారి గెటప్ చూస్తుంటే.. కాంతారా గుర్తుకొస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.