ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు.. రూ.2 కోట్లతో శ్రేతేజ్ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టారట అల్లు అర్జున్. ఇందుకోసం బన్నీ రూ.1 కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. ఇక ఈ ట్రస్ట్‌లో సభ్యులుగా.. శ్రీతేజ్ తండ్రి, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు ఉంటారని సమాచారం.
బాధిత కుటుంబానికి అండగా ఉండటం కోసమే.. ఈ నిర్ణయానికి కారణం అని చెబుతున్నారు. లీగల్ ఇష్యూస్ నుంచి బయటపడగానే.. ఈ ట్రస్ట్ గురించి అల్లు అర్జున్ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవంత్ అనే మహిళా ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆమె కుమారుడు కూడా ఆ తొక్కిసలాటలో గాయపడి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు ను చూడటానికి పుష్ప 2 సినిమా నిర్మాతలు కిమ్స్ కు చేరుకున్నారు. అక్కడే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో రేవతి భర్తకు మైత్రీ మూవీస్ తరపున 50 లక్షల చెక్ ను ఆర్ధిక సాయం కింద అందించారు.