తెలంగాణలో VRO మళ్లీ రానుంది. ఇక ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో VRO వ్యవస్థ పునరుద్ధరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక పాత ఉద్యోగులను మళ్లీ VRO పోస్టుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది.
ఇందుకోసం ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ CCLA కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. భూభారతి చట్టంలో భాగంగా VRA, VRO వ్యవస్థను తీసుకురానుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.