శ్రీ విష్ణు “అల్లూరి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్?

-

ప్రయోగాత్మక సినిమాలతో అందరినీ మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వివిధ జోనర్స్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీ విష్ణు. తాజాగా మరో మూవీ తో ఆడియోస్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా.. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” అల్లూరి”. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా.. లక్కీ మీడియా బ్యానర్ పై అల్లూరి సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీ విష్ణు ఫుల్ లెన్త్ మాస్ రోల్ తో పాటు మొదటిసారి పోలీస్ పాత్ర చేస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలనుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈవెంట్ కు గెస్ట్ గా అల్లు అర్జున్ ని పిలిచినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తే సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. దీనిపై త్వరలోనే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version