తెరమరుగైన అల్లు అర్జున్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోల లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. కానీ హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తమ కెరియర్ ను సరైన దారిలో తీసుకెళ్తే.. స్టార్ హీరోయిన్ గా సంవత్సరాల తరబడి కొనసాగుతారు. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి ఉంటుంది. అలాంటి వారిలో అనురాధ మెహతా కూడా ఒకరు.ఆర్య సినిమాలో అల్లు అర్జున్ సరసన గీతా పాత్రలో నటించిన ఈమె గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఆర్య సినిమా అంటే ముందుగా గుర్తుకొచ్చేది అనురాధ మెహతా.. అందులో ఈమె పోషించిన గీత క్యారెక్టర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పుట్టిన అనురాధ మెహతా ఆర్య సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన నువ్వంటే నాకిష్టం సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందివ్వకపోవడంతో ఈమెకు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఆర్య సినిమా హిట్ అయినా కూడా ఈమెకు అవకాశాలు రాలేదు.

2007లో మహారాజశ్రీ అనే సినిమాలో అందాలు ఆరబోసినా.. అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ, మలయాళం వైపుకు వెళ్లి హీరోయిన్ గా ట్రై చేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయేసరికి. సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయింది. ఇప్పటివరకు అనురాధ మెహతా సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోయేసరికి ఆమె ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అందం, అభినయం,నటన ఉన్నా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ ప్రస్తుతం ఈమె మంచి అవకాశం వస్తే .. ఎంట్రీ ఇవ్వడానికి ఎదురు చూస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బాగుంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version