హృదయం ఆనందంతో నిండిపోతుందన్న అల్లు అర్జున్ భార్య.. రీజన్ ఏంటంటే

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్లకు దీటుగా అభిమానుల్ని సంపాదించుకున్న ఈమె ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుపుతుంది. అయితే తాజాగా స్నేహ తన మనసును ఆనందంతో నింపే విషయాలు ఇవే అంటూ ఓ వీడియో పోస్ట్ చేయాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

allu arjun sneha reddy

అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువనే చెప్పాలి. ఈమె ఇంస్టాగ్రామ్ లో 8.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బన్నీ ని పెళ్లి చేసుకున్న అనంతరం తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు స్నేహ రెడ్డి. ఇప్పటికే తన ఫ్యామిలీ, ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్ వంటి వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు పోస్ట్ చేస్తూ వస్తున్న స్నేహా తాజాగా వీటన్నిటికీ సంబంధించి ఒక వీడియోను పంచుకొని నా మనసును ఆనందంతో నింపే విషయాలు ఇవే అంటూ రాసుకొచ్చారు.

తాజాగా తన గ్లామర్ సీక్రెట్ ను చెప్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు స్నేహ రెడ్డి. ఈ వీడియోలో హెల్తి ఫుడ్ తో పాటు గార్డెనింగ్, వ్యాయామం, యోగ, ఫ్యామిలీ, ప్రకృతి తన నిత్య జీవితంలో భాగం అంటూ తెలిపారు. బుక్స్ చదవడం కూడా తనకు ఎంతో ఇష్టమైన విషయం అంటూ సోఫాలో రిలాక్స్ గా కూర్చొని ఒక బుక్ చదువుతున్న ఫోటోను పంచుకున్నారు. ఫేవరెట్ ట్రావెల్ మెమోరీస్ అంటూ ఈ మధ్యకాలంలో తను ఎంజాయ్ చేసిన ప్లేస్లను పంచుకున్నారు. వీటితోపాటు తన డేను ఆనందంగా నింపే విషయాల్లో ట్రావెలింగ్ కూడా ఒకటని చెప్పుకొస్తూ ఇష్టమైన హాబీస్ లో గార్డెనింగ్ ఒకటని తెలిపారు. ఫేవరెట్ అవుట్ ఫిట్ చీర అంటూ చెప్పుకు వచ్చిన స్నేహ తను చీరలో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. చివరగా తన ఫేవరెట్ పీపుల్ అంటూ అల్లు అర్జున్, అర్హా, అయాన్ లతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version