BREAKING : పునీత్‌ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

-

కన్నడ పవర్‌ స్టార్‌, హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు మరోసారి… టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. హైదరాబాద్‌ నుంచి కాసేపటి క్రితమే బెంగళూరు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో… హైదరాబాద్‌ నుంచి విమాన మార్గం ద్వారా బెంగళూరు చేరుకున్నారు అల్లు అర్జున్‌.

ఇక బెంగళూరు చేరుకున్న అనంతరం.. . ముందుగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ సమాధిని అల్లు అర్జున్‌ సందర్శించుకున్నారు. పునీత్‌ సమాధి వద్ద బన్నీ నివాళులు అర్పించారు. అనంతరం.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో… కలిసి భోజనం చేశారు బన్నీ. ఇవాళ 3 గంటల సమయంలో.. తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు బన్నీ. కాగా.. గత సంవత్సరం అక్టోబర్‌ 29 వ తేదీన పునీత్‌ రాజ్‌ కుమార్‌ గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌ చేస్తుండగా… గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version