రేషన్ కార్డులు ఉన్న వారికి 2024 నుంచి రేషన్ తో పాటు రాగులు, జొన్నలు ఇస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం రైతులు జొన్నలు, రాగులు సాగుచేసేలా ప్రోత్సాహిస్తామన్నారు. రేషన్ కార్డుదారులకు పైలెట్ ప్రాజెక్టుగా గోధుమపిండిని కొన్ని చోట్ల పంపిణీ చేస్తామన్న ఆయన త్వరలోనే రాష్ట్రమంతా అందుబాటులోకి తెస్తామన్నారు.
ఇక దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బికే ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫోర్టీఫైడ్ బియ్యాన్ని సరాఫరా చేయనున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇకనుంచి అన్ని జిల్లాలకు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 6,165 కోట్ల విలువైన 30.19 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. అలాగే రైతులకు రూ.4,800 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈనెల 15లోగా మిగతా దాన్యం కొనాలని అధికారులకు సూచనలు చేశామని, పేర్కొన్నారు.