టాలీవుడ్‌ లో హీరోయిన్లను అందుకే వాడుకుంటారు – అమలాపాల్‌

-

తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అమలాపాల్. దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో ప్రేమలో పడి, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళింది.. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోవలసి వచ్చింది. అయితే ఈ విషయాన్ని మరిచి మళ్ళీ సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది అమలాపాల్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ ను కేవలం లవ్ సీన్స్, సాంగ్స్ తీసుకుంటారని చెప్పింది. సినిమాలో కథకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరని, గ్లామర్ కోణంలోనే తీస్తారని చెప్పుకొచ్చింది.

ఇక్కడ డిఫరెంట్ ఉన్న కల్చర్ కారణంగా తెలుగు సినిమాలకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయానంది ఈ అందాల భామ. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని కుటుంబాల చేతిలోనే ఉంటుందని, వారి ప్రభావం సినిమాలపై ఉంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version