TS to TG: రేవంత్ లాజిక్ కరెక్టేనా!

-

తెలంగాణ ఏర్పాడ్డాక..అన్నీ కొత్త రూల్స్ వచ్చాయి. రాష్ట్రానికి అనుగుణంగా రూల్స్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి ఏపీలో అమలు చేసిన రూల్స్ తీసేసి…కేసీఆర్ ప్రభుత్వం కొత్త రూల్స్ చాలా తీసుకొచ్చింది. ఇదే క్రమంలో తెలంగాణ రిజిస్ట్రేషన్స్ విషయంలో అప్పటివరకు ఏపీగా ఉన్న దాన్ని మార్చి ‘టీఎస్’గా మార్చింది. ముఖ్యంగా వాహనాల రిజిస్టేషన్స్ ‘టీఎస్’తో మొదలైంది. సాధారణంగా తెలంగాణ కాబట్టి అందరూ ‘టీజీ’ వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం పేరు ప్రతిభింబించేలా రిజిస్ట్రేషన్ పేరు ఉంటుంది.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ‘ఏపీ’, తమిళనాడు ‘టీఎన్’..కాబట్టి తెలంగాణ అంటే ‘టీజీ’ అని అంతా అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ సర్కార్ ‘టీఎస్’గా పెట్టింది. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్. ఈ అంశాన్ని మొదట నుంచి రేవంత్ రెడ్డి తప్పుబడుతూనే వస్తున్నారు. ‘టీఎస్’ అంటే టీఆర్ఎస్ నుంచి వచ్చిందని మధ్యలో ‘ఆర్’ తీసి ‘టీఎస్’ అని పెట్టారని తాము అధికారంలోకి వచ్చాక దాన్ని మార్చి ‘టీజీ’గా చేస్తామని అంటున్నారు. తాజాగా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో చాలావరకు లాజిక్ ఉందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణంగా చూసుకుంటే తెలంగాణ కాబట్టి ‘టీజీ’ అనే ఉండాలని, కానీ కేసీఆర్ సర్కార్ రాజకీయ కోణాన్ని కూడా చూసుకుని ‘టీఎస్’ అని పెట్టిందని, టీఆర్ఎస్ నుంచే టీఎస్ వచ్చిందని అంటున్నారు. తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని, లాజిక్ ప్రకారం చూసుకుంటే ‘టీజీ’నే ఉండాలని అంటున్నారు.

కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని టీఎస్ గా పెట్టుకుందని, మరి ఇప్పుడు దాన్ని అధికారంలోకి వచ్చాక రేవంత్ మారుస్తానని అంటున్నారు…అయితే ఇప్పుడు అంతా టీఎస్ అయిపోయింది…మళ్ళీ టీజీగా మారిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ అధికారంలోకి రావడం గాని, ఈ రిజిస్ట్రేషన్ గాని మార్చడం జరుగుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version